Feb 27,2023 07:30

శ్రీమతి గంటా కమలమ్మ స్మారక కథా పురస్కారానికి గాను, రాయలసీమ కథకుల నుండి రచనలను ఆహ్వానిస్తున్నట్లు అవార్డు వ్యవస్థాపకులు గంటా మోహన్‌ తెలిపారు. ఈమేరకు, శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2021, 2022 సంవత్సరాల్లో ముద్రితమైన కథా సంపుటాలను మూడేసి ప్రతులను, గంటా మోహన్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బంగారు పాలెం (పోస్టు, మండలం), చిత్తూరు జిల్లా అనే చిరునామాకు మార్చి 30 లోపు చేరేలా పంపాలని కోరారు. పురస్కార గ్రహీతను పదివేల రూపాయలు నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు తెలిపారు.