Apr 18,2023 21:09

న్యూఢిల్లీ : కర్బన ఉద్గారాలను తగ్గించడానికి వీలుగా గ్రీన్‌ స్టెప్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కెయిర్న్‌ అయిల్‌ అండ్‌ గ్యాస్‌ వెల్లడించింది. 2050 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 7.5 లక్షల చెట్లను నాటేందుకు గ్రీన్‌ స్టెప్స్‌తో జట్టు కట్టినట్లు పేర్కొంది. రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కెయిర్న్‌ వెల్లడించింది. ఈ ఒప్పందాల ద్వారా వచ్చే 25 ఏళ్ల నాటికి దాదాపు 5 లక్షల టన్నుల కార్పన్‌డైఆక్సైడ్‌ను సీక్వెస్టర్‌ చేయాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. కంపెనీ రవ్వ ఆఫ్‌షోర్‌ కార్యకలాపాలలో, చుట్టుపక్కల జీవవైవిధ్య పరిరక్షణ ప్రాజెక్టులను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ, జిల్లా పరిపాలనతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2030 నాటికి 3 లక్షల మడ చెట్లను నాటనున్నామని వెల్లడించింది.