
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : అధిక ధరలు, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగం, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... సిపిఎం రాజధాని డివిజన్ కమిటి అధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాజధాని డివిజన్ కమిటి కార్యదర్శి ఎం.రవి, నాయకులు ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వరరావు, పి.బాబూరావు, గడ్డం కృష్ణ, షేక్ జానీ, పారిశుధ్య కార్మికులు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కల్యాణి కి వినతిపత్రం అందజేశారు.