- పంచాయతీ ఈవో నాగరాజుకు వినతి పత్రం అందజేత
ప్రజాశక్తి-అమరావతి (గుంటూరు) : రాష్ట్రంలో రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు లేకుండా పెరిగిపోతున్నాయని సిపిఎం మండల కార్యదర్శి బి సూరిబాబు అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఈవో నాగరాజుకు సిపిఎం నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి సూరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఒకవైపు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గురిచేస్తుందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు లేకుండా పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ ద్వారా పేదలకు సబ్సిడీలు అందించే కందిపప్పు, నూనె ఇతర సరఫరాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు అధికంగా వస్తుందని.. విద్యుత్ చార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు. పనులు లేక వ్యవసాయ కూలీలు కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారని.. పట్టణంలో నిరుద్యోగులకు, కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పనులు కల్పించి పనికి తగ్గ వేతనం అందించాలని కోరారు. చెత్త పనులు రద్దుచేసి, ఆస్తి పన్ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోద్దీన్ వలి, రఫీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.










