
- మంత్రి గుడివాడ అమరనాథ్‌కు సిపిఎం,ఐద్వా నాయకుల వినతి
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోటలో గడపగడపకి కార్యక్రమం విచ్చేసిన మంత్రి గుడివాడ అమరనాకు సిపిఎం ఐద్వా నాయకులు శ్రీనివాసరావు, వరలక్ష్మిలు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని, పెదగుమ్మం బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్కీమ్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలని వారు కోరారు. వైసిపి అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు జోక్యం మాట్లాడుతూ.. కశింకోట సమస్యలు పరిష్కారం కోసం మంత్రి గుడివాడ అమరనాథ్ ప్రత్యేక దృష్టి సాధిస్తారని తెలిపారు.