Jul 31,2023 11:11

శ్రీకాకుళం : మణిపూర్‌ ఘాతుకానికి కారకుడైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ... సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీకాకుళంలోని సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్‌లో శాంతిభద్రత నెల కొల్పడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. అత్యాచారాలు జరుగుతుంటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.