కోవూరు (నెల్లూరు) : కోవూరు నియోజకవర్గం అభివృద్ధికై చేపట్టిన సిపిఎం ప్రజా పోరు యాత్ర శనివారంతో 3వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద నుండి ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది. కోవూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు.










