Jun 12,2023 22:38
  • పునరావాసం పూర్తయ్యాకే ఏమైనా..!
  • 20 నుంచి పాదయాత్ర
  • పోస్టర్‌ ఆవిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టులో ముంపుప్రాంతాల ప్రజలకు పునరావాసం పనులను తక్షణం పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం పనుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పోలవరంలో లక్షలాది మంది నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం పోరుకేక పేరుతో భారీ పాదయాత్రను చేపట్టనునుట్లు తెలిపారు. ఈ నెల 20న భధ్రాచలం దగ్గరును ఎటపాక నుంచి మొదలై 15 రోజులపాటు ముంపు ప్రాంతాల్లో కొనసాగి జూలై 4న విజయవాడకు పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. పోలవరం పోరుకేక పేరుతో రూపొందించిన పోస్టర్‌ను విజయవాడలో బాలోత్సవ్‌ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారామ్‌, వి వెంకటేశ్వర్లు సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం బాధ్యతారహితంగా మాట్లాడుతోందని విమర్శించారు. ఏ ప్రాజెక్టు పరిధిలోనైనా పునరావాసం పూర్తి చేశాకే ప్రాజెక్టు పనులు ముందుకువెళ్లాలనేది అంతర్జాతీయంగా వును సూత్రం అయితే పోలవరంలో నిర్వాసితులను గాలికి వదిలేసి ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం లైడార్‌ సర్వేతో మరో 36 గ్రామాలను అదనంగా చేర్చింది తప్ప పూర్తి స్థాయి ముంపు తేల్చలేకపోయిందని, 2022 జూలైలో వచ్చిన వరదలకు193 గ్రామాలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. చింతూరు, కూనవరం మండలాల్లో మొత్తం ముంపునకుగురైతే కూనవరంలో ఒక గ్రామం మాత్రమే ముంపునకు గురైందని ప్రభుత్వం చెప్పడం అవాస్తవమని అన్నారు. పునరావాసం కోసం ప్రభుత్వం నిర్మించిన గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాస పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని తెలిపారు. డయాఫ్రంవాల్‌ డ్యామేజిపై ప్రభుత్వం రాజకీయంగా మాట్లాడటం ఆపి జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముంపు ప్రాంతాల లైడార్‌ సర్వేను ఆకాశం నుండి కాకుండా నిర్దిష్టంగా 1986, 2022 వరదలను ప్రామాణికంగా తీసుకొని సమగ్ర సర్వే చేయాలనిడిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో పునరావాసం పనులు కేంద్రానికి సంబంధం లేదనడం తగదని అన్నారు. పోలవరం పునరావాసం కోసం రూ 32 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలను చెప్పాలని, సందర్శనకు అఖిపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షా పోలవరం ప్రాజెక్టు నిధులపై ఒక్క మాట మాట్లాడకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో అసలైన నిర్వాసితుల సమస్యను పక్కదారి పట్టించేలా అధికార, ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. కేవలం కాంట్రాక్లర్ల ప్రయోజనాల కోసం తగువులాడుతున్నారు తప్ప పునరావాస బాధితులకు న్యాయం చేయాలనే అంశాన్ని పూర్తిగా విస్మరించారనిఅనాురు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పునరావాస చర్యలను చేపట్టాలని కోరారు. కేంద్రం ఇపుడు ఇస్తున్న రూ 12వేల కోట్లను పునరావాసం కోసం ఖర్చు చేయాలనిడిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యను అజెండా చేసేందుకు ఈ పాదయాత్రను చేపట్టామని తెలిపారు. పోలవరం పోరుకేక పాదయాత్ర ముంపు ప్రాంతం అయిన భద్రాచలం దగ్గరలోని ఎటపాక నుండి మొదలై అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా మీదుగా విజయవాడలోకి జూలై నాల్గవ తేదీకి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో నిర్వాసితులతో భారీ ధరాును చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర ప్రారంభం, ముగింపు సభలకు సిపిఎం జాతీయ నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయానికి గురవుతున్న ముంపు గ్రామాల ప్రజల కోసం చేపట్టిన ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.