
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు నిర్ణయం పట్ల సిపిఐ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఎన్నికైన ప్రజా ప్రతినిధులే సవాలు చేసే ప్రమాదకరమైన ధోరణి పెరిగిపోతోందని సిపిఐ నేత డి.రాజా విమర్శించారు. ప్రార్ధనా స్థలాల చట్ట స్ఫూర్తిని దెబ్బతీయడం ద్వారా మనం దేశాన్ని మరింత అగాధంలోకి నెట్టేస్తున్నామని అన్నారు. కాగా దీనిపై కాంగ్రెస్ మౌనం పాటించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ ఇలా మౌనం పాటించడమనేది సమస్యకు పరిష్కార మార్గం కాదని అన్నారు.