ప్రజాశక్తి - విజయవాడ : సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో సోమవారం ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ ప్రజానాట్యమండలి వారిచే 'వీర తెలంగాణ' ఒగ్గుకథ. గుంటూరుజిల్లా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారిచే 'ఓం హాం.. ఓ హం..' నాటిక ప్రదదర్శించబడుతుంది. నాటిక రచన వల్లూరు శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ఐదురోజులపాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల చివరిరోజు సభలో సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ సినీ గేయ రచయిత చైతన్య ప్రసాద్, సినీ దర్శకులు బాబ్జీ పాల్గొననున్నారు.










