Oct 24,2023 16:45

హైదరాబాద్‌: బోరబండ ఇన్‌స్పెక్టర్‌పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో సీపీ సందీప్‌ శాండిల్య సీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేశారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ చర్యలకు ఉపక్రమించారు. ఈ ఉదయం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య.. బోరబండ పోలీస్‌ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలు అనంతరం బోరబండ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌పై వేటు వేశారు. అంతేకాకుండా మహిళల వేధింపుల కేసులను కూడా నీరుగార్చారన్న అభియాగాలు కూడా ఉన్నాయి. ఓ రాజకీయ నేత కనుసన్నుల్లో పని చేస్తున్నారనే ఆరోపణలు చోటుచేసుకున్నాయి. వీటితో పాటు పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే వారిపై అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే రౌడీ షీటర్లు రికార్డ్‌ మెయింటైన్స్‌ కూడా సరిగ్గా చేయలేదని గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లను గుర్తుపట్టక పోవడంతో సీపీ ఈ చర్యలకు దిగారు.