Aug 02,2023 16:25

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్యజిల్లా) : రైతన్నల సంక్షేమానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కితాబునిచ్చారు. పీటీఎం మండలం దేవప్పకోట, మద్దయ్యగారిపల్లిలో బుధవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను రారాజులు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్‌, ఎంపీడీవో గిరిధర్‌ రెడ్డి, మద్దయ్యగారిపల్లి ఎంపీటీసీ సయ్యద్‌ బాషా, సర్పంచ్‌ రామంజులు, మడుమూరు సర్పంచి నాగరత్న భాస్కర్‌ నాయుడు, కో -ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌ వలీ, సచివాలయం కన్వీనర్‌ రమణ,స్ధానిక నాయకులు నాయకులు మెకానిక్‌ చంద్ర,ఫయాజ్‌ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.