అమరావతి: వైసీపీ కీలక నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నివాసంలో అత్యవసరంగా భేటీ కానున్నారు. సజ్జలరామకఅష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డిలు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు తదనంతర పరిణామాలపైనా, ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలపై కసరత్తు చేసే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కొంత ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో ఈసారి మేనిఫెస్టోను పకడ్బందీగా అమలు చేసేలా కార్యచరణ రూపొందించనున్నారు. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈసారి కూడా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. గత మేనిఫెస్టోలో మధ్యపాననిషేదం, ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు, సీపీఎస్ రద్దు వంటి హామీలను ఇవ్వడం వల్ల ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈసారి మేనిఫెస్టోను అమోదయోగ్యమైన హామీలను పొందుపరిచేలా వైసీపీ కీలక నేతలకు సీఎం జగన్‌రెడ్డి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి.