May 06,2023 21:30

న్యూఢిల్లీ : జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేశ్‌ గోయల్‌ నివాసం, సంస్థ పాత కార్యాలయాల్లో సిబిఐ సోదాలు చేపట్టింది. కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ విచారణలో భాగంగా శుక్రవారం గోయల్‌కు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. ఆ సంస్థ మాజీ అధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేసింది. దేశంలో ఒకప్పుడు అతిపెద్ద విమానయాన కంపెనీగా ఉన్న సంస్థ.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని 2019లో మూతపడింది. దీన్ని జలన్‌ కాల్‌రాక్‌ కన్సోరియం స్వాధీనం చేసుకున్నప్పటికీ.. ఇప్పటికీ సేవలు పునరుద్దరించలేకపోయింది.