Mar 29,2023 20:37
  • 64ఎంపి కెమెరాతో విడుదల

హైదరాబాద్‌ : రియల్‌మి బడ్జెట్‌ ధరలో సి 55 ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.9,999 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్‌ను 64 ఎంపి కెమెరాతో అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ఫోన్‌ను హైదరాబాద్‌లో రియల్‌ మి గ్లోబల్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ శ్రీ హరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 4జిబి, 64జిబి వేరియంట్‌ ధరను రూ.10,999గా నిర్ణయించామన్నారు. 6జిబి, 64జిబి ధరను రూ.11,999గా, 8జిబి, 128 జిబి ధరను రూ.13,999గా పేర్కొన్నారు. మార్చి 31 వరకు ఆఫర్‌లో రూ.1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చన్నారు. తెలంగాణలో ప్రస్తుతం తమకు 15 సర్వీసు సెంటర్లు ఉన్నాయని.. 2023 చివరి నాటికి మరో 12 సెంటర్లను అందుబాటులోకి తేనున్నామన్నారు. దేశంలోని అత్యధిక మంది యువత తమ ఫోన్లను వాడటానికి ఆసక్తి చూపేలా పలు క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నామన్నారు.