Apr 12,2023 13:30

అప్పనవీడు (ఏలూరు) : అప్పనవీడు జాతీయ రహదారిపై కారు దగ్ధమైన ఘటన బుధవారం జరిగింది. విజయవాడ వైపు నుండి రాజమండ్రికి ఆరుగురితో ప్రయాణిస్తున్న కారులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కారులోని ప్రయాణీకులు బయటకు వచ్చేయడంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో అందరు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.