
ప్రజాశక్తి-కాళ్ళ (పశ్చిమగోదావరి) : జిల్లాలోని కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో ఉండి మాజీ ఎంఎల్‌ఏ వేటుకూరి వెంకట శివరామరాజు ఆధ్వర్యంలో జగనాసుర దిష్టిబొమ్మను సోమవారం సాయంత్రం దహనం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపు మేరకు వైసిపి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ' సైకో జగన్ పోవాలి' అని ఉండి మాజీ ఎంఎల్‌ఏ వేటుకూరి వెంకట శివ రామరాజు ఆధ్వర్యంలో కలవపూడి గ్రామంలో జగనాసుర దహనం దిష్టిబొమ్మను దహనం చేశారు. పదితలల జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను రావణ సుర రూపంలో తయారుచేసి జగనాసుర దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.