Jan 03,2023 16:23

ముంబై : శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి లంకతో వన్డే సిరీస్‌తో జట్టులోకి చేరనున్నాడు. ''శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టులోకి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చేర్చింది'' అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. జనవరి 3 నుంచి 7 వరకు టీ20 సిరీస్‌ జరగనుండగా.. జనవరి 10 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా , మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌