May 20,2023 09:37

శాంతపురం అనే ఊరిలో పద్మ, కిషోర్‌ అనే దంపతులు ఉన్నారు. వారికి రీల అనే అమ్మాయి ఉంది. తర్వాత నాలుగు సంవత్సరాలకు బాబు జన్మించాడు. రీలకు తన తమ్ముడిని ఎత్తుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. కాని పద్మ బాబుని ఇచ్చేది కాదు. ఓసారి ' అమ్మా! నాకు తమ్మున్ని ఎత్తుకోవాలని ఉంది.' అని అడిగింది. అప్పుడు అమ్మ 'రీల నువ్వు చిన్న అమ్మాయివి. తమ్ముడిని ఎత్తుకోలేవు' అని కసిరింది.
            ఒక రోజు బాబు గాఢంగా నిద్రిస్తుండగా పద్మ, కిషోర్‌ కట్టెలు తీసుకురావడానికి వెళ్ళారు. రీలను ఇంట్లోనే ఉంచారు. వెంటనే వస్తామని అడవికి వెళ్లారు. కొంతదూరం వెళ్లాక వారికి పులి కనిపించింది. పులి నుంచి తప్పించుకోవాలని చూసి అడవిలో దారి తప్పిపోయారు. చీకటి పడినా ఇంకా అమ్మ, నాన్న రాకపోవడంతో, రీల తొట్టెలో ఏడుస్తున్న తమ్ముడికి పాలు కాచి, సీసా పట్టించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మ, కిషోర్‌ ఇంటికి చేరారు. తొట్టెలో ఆడుకుంటున్న బాబుని చూసి ఆనందం కలిగింది పద్మకి. ఆ రోజు నుంచి బాబును ఎత్తుకోమని రీలకి ఇవ్వసాగింది. దాంతో బుజ్జి తమ్ముడిని ఆనందంగా ఎత్తుకుని మురిసిపోయింది రీల.
 

ఎదుల్ల అభిషేక్‌

- ఎదుల్ల అభిషేక్‌
9వ తరగతి, జక్కాపూర్‌, సిద్దిపేట జిల్లా.