ప్రజాశక్తి-సింహాద్రిపురం(కడప) : కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో అన్నా చెల్లెలు మృతి చెందారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి అన్నా చెల్లెలు అయిన నవదీప్, భవ్య శ్రీలను కాటు వేసిన సంగతి విధితమే. అయితే నవదీప్ పులివెందుల లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. భవ్య శ్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి భవ్య శ్రీ మతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నా చెల్లెలు పాము కాటుతో చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారింది.










