Sep 28,2023 16:52

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ వ్యక్తిగత డ్రెస్సేజ్‌ విభాగంలో అనుష్‌ గార్వాలా కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రస్సేజ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈక్వెస్ట్రియన్‌లో ఇప్పటికే భారత్‌ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హదరు విపుల్‌, అనూష్‌ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్‌ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు.