- సెమీస్‌లో చైనీస్ తైపీ చేతిలో ఓటమి
26వ ఐటిటిఎఫ్ ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో 3వ సీడ్ భారత్ 0-3 తేడాతో 2వ సీడ్ చైనీస్ తైపీ చేతిలో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌లో శరత్ కమల్ 6-11, 6-11, 9-11తో ఛౌ చింగ్ యంగ్ చేతిలో, రెండో సింగిల్స్‌లో జి. సాథియాన్ 5-11, 6-11, 10-12తో లిన్-యన్-జు చేతిలో వరుససెట్లలో ఓడారు. ఇక మూడో సింగిల్స్‌లో హర్మీత్ దేశారు 6-11, 7-11, 11-7, 9-11తో కో-ఛెంగ్-జూ చేతిలో పోరాడి ఓడాడు. హర్మీత్ దేశారు మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్‌లన్నింటిలోనూ ఏకపక్ష పోటీలో భారత టిటి ప్లేయర్స్ ఓటమిపాలయ్యారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానంలో దేశారు.. 33వ ర్యాంకర్ కావో-చెంగ్-కు ముచ్చెమటలు పట్టించాడు. ఓ దశలో ఐదో గేమ్‌కు దారితీస్తుందనుకున్న దశలో హర్మీద్ ఓటమిపాలయ్యాడు. దీంతో భారత టిటి జట్టు తొలిసారి కాంస్యంతో మెరిసింది.










