Jul 30,2023 11:27

హిందూపురం (అనంతపురం) : హిందూపురంలోని ఎపిఎస్‌ఆర్‌టిసి డిపోకు చెందిన లగ్జరీ బస్సులో కిటికీ అద్దాలు పగిలి ప్రయాణీకుడిపై పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున పాల సముద్రం సమీపంలో జరిగింది. హిందూపురం ఎపిఎస్‌ఆర్‌టిసి డిపోకు చెందిన తిరుపతి నుంచి హిందూపురం వస్తున్న లగ్జరీ బస్సు లో ప్రయాణికుడిపై బస్సు కిటికీ అద్దాలు పగిలిపడ్డాయి. ఆ సమయంలో ప్రయాణికుడు జర్కిన్‌ వేసుకొని ఉండడంతో తలకు ఇతర శరీర భాగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. చేతులకు గాజు ముక్కలు గుచ్చుకొని స్వల్పగాయాలయ్యాయి. కాలం చెల్లిన బస్సులనే నడుపుతూ అందులోనూ హైటెక్‌ సర్వీస్‌ చార్జీలను ప్రయాణికుల నుంచి గుంజుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ఆందోళన కలుగుతుందని పలువురు తెలిపారు.