- హామీ నిలబెట్టుకోని కేంద్రం
న్యూఢిల్లీ : ఆందోళన చేస్తున్న ఆటగాళ్లకు కేంద్రం ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ బ్రిజ్ భూషణ్ అల్లుడు విశాల్ సింగ్ పేరును రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చారు. బ్రిజ్ భూషణ్ బంధువులు లేదా సహాయకులు ఎన్నికల్లో పోటీ చేయరని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గతంలో సాక్షి మాలిక్, ఇతర రెజ్లర్లకు చెప్పారు. బీహార్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా విశాల్ పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బ్రిజ్ భూషణ్ బీహార్ యూనిట్‌ను రద్దు చేసి ఆయన అల్లుడిని అధ్యక్షుడిగా చేశారని మాజీ అధికారులు అడ్‌హాక్ కమిటీకి ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న జమ్ముకాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేశ్ మిట్టల్‌కుమార్ అప్పీల్‌ను పరిశీలించనున్నారు. అడ్‌హాక్ కమిటీ కూడా జాబితాపై అసంతప్తితో ఉన్నట్లు సమాచారం. జులై 6 నుంచి 11 వరకు ఎన్నికలను పొడిగించారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకునేందుకు గతంలో ఉన్న గడువును 21 నుంచి ఈ నెల 25కి పెంచారు. పది రాష్ట్రాల సమాఖ్యల పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అక్రమంగా తొలగించారని మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ యూనిట్లు ఫిర్యాదు చేశాయి.
ప్రత్యేక కోర్టుకు వేధింపుల కేసు
మహిళా అథ్లెట్లను వేధించిన బిజెపి ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై కేసు ఎంపీలు, ఎమ్మెల్యేల నేరాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయబడింది. ఢిల్లీ పోలీసుల దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహిమా రారు ఈ ఆదేశాలు ఇచ్చారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఇప్పుడు కేసును విచారించనున్నారు. 27న కేసు విచారణకు రానుంది. ఆరుగురు రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్ చిత్రహింసలకు గురిచేసినట్లు జస్పాల్‌కు ఛార్జ్‌షీటు కూడా అందింది.