బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల నివేదిక
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు ఆదివారం కోర్టుకు తెలిపారు. ఆయనపై అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్ పై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోంది. తజికిస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నిందితుడు ఫిర్యాదుదారు (మహిళా రెజ్లర్)ని గదిలోకి పిలిచి బలవంతంగా కౌగిలించుకున్నాడని చెప్పారు. నిరసన వ్యక్తం చేయగా.. తండ్రిలా చేశానని అన్నాడన్నారు. నిందితుడికి తన చర్యలపై పూర్తి అవగాహన ఉందని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆమెకు అన్యాయం జరిగిందని చెప్పారు.