భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషన్ శరణ్ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు విచారణ జరిపింది. ఎంపిపై వచ్చిన ఆరోపణలపై మరోసారి కోర్టు ఈ నెల 23న విచారించనున్నది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కోర్టు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లకు కోర్టు జులై 20న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు బెయిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే, బెయిల్ మంజూరు చేసే సమయంలో షరతులు విధించాలని కోరారు. బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.










