- సెన్సెక్స్‌కు 161 పాయింట్ల నష్టం
ముంబయి : వరుసగా ఎనిమిది సెషన్లలో లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలు చవి చూశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 61,193కు తగ్గింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 18,090 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయని బ్రోకర్లు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. సెన్సెక్స్-30లో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటిసి, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టిసిఎస్, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, రిలయన్స్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా నేపథ్యంలో ఇండిగో, స్పైస్‌జెట్ వరుసగా 4.77 శాతం, 1.40 శాతం చొప్పున పెరిగాయి.










