
ప్రజాశక్తి-అమరావతి : అమరావతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి గ్రామ ఉప సర్పంచ్ విజయ సాగర్ బాబు, ఈఓపిఆర్డి ప్రసాద్ బాబు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు