కొలంబో : శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక 2022 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయన రచించిన ''ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా'' పుస్తకం ఈ బహుమతికి ఎంపికైంది. దేశ అంతర్యుద్ధంలో హత్యకు గురైన ఓ యుద్ధ ఫోటో గ్రాఫర్ గురించి ఈ పుస్తకంలో వివరించారు. ఆయన రాసిన 'ది లెజెండ్ ఆఫ్ ప్రదీప్ మాథ్యూ' పుస్తకం కామన్వెల్త్ బహుమతి, ది డిఎస్‌సి ఫ్రైజ్, ది గ్రేటీయన్ ప్రైజ్‌లను గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న రెండో శ్రీలంక రచయితగా కరుణ తిలక రికార్డు సష్టించారు. లండన్‌లో జరిగిన ప్రత్యేక వేడుకలో క్వీన్ కన్సార్ట్ కెమిల్లా నుంచి ఈ పురస్కారం అందుకున్నారు. బహుమతి కింద ఆయనకు 50,000 పౌండ్లు అందజేశారు. 2019లో ఆయనకు ఆంగ్ల భాషా సాహిత్య పురస్కారం దక్కింది.










