May 12,2023 09:11

హాయ్ ఫ్రెండ్స్‌ ! .. వేసవి సెలవుల్లో చదివేందుకు నేను కొన్ని పుస్తకాలు సెలెక్ట్‌ చేసుకున్నా. వాటిని చదువుతున్నా. అప్పుడు అనిపించింది నాకు. పుస్తకం తన గురించి తాను మనకు చెబితే ఎలా ఉంటుందీ అని. ఇదిగో.. ఇలా ఉంటుంది అనిపించింది. ''నేను పుస్తకాన్ని. నాలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎలా అంటే కథల పుస్తకాలు, నవలలు, సైన్సు, ఆత్మకథలు ఇలా చాలా రూపాల్లో ఉన్నాను. నేను మంచి కాలక్షేపానికి ఉపయోగపడతాను. కానీ ఈ కాలపు పిల్లలు ఫోన్‌ పట్టుకొని వదలడం లేదు. దాని వల్ల ఏం ఉపయోగమో... నాకు తెలీదు. కానీ నన్ను చదివితే తెలివితేటలు పెరుగుతాయి. జీవితంలో ఎలా ఉండాలో అని ఒక అవగాహన వస్తుంది. మంచి, చెడు తెలుస్తుంది. ప్రతి విషయంపై ఒక అనుభవం తెలుస్తుంది. ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకోవాలో... సంస్కారం వస్తుంది. అందుకే చెబుతున్నా. పుస్తకాలు చదవండి''.
11

- కె. వరుణ్‌,
7వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూల్‌
మంగళగిరి, గుంటూరు జిల్లా.