వర్ధమాన కవి యాడవరం చంద్రకాంత్ గౌడ్ రాసిన 'చంద్రుడు చెప్పిన కథలు' బాలల కథల సంపుటి పుస్తక పరిచయ సభ 4. 4.2023 మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సిద్ధిపేటలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. ఆచార్య గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, ఆచార్య మర్పడగ చెన్న కృష్ణారెడ్డి, సత్తు యాదవరెడ్డి, డాక్టర్ వాసవరవేణి పరుశురాములు, దాతారు సూర్య ప్రకాష్, బైతి దుర్గయ్య, వేల్పుల రాజు తదితరులు పాల్గొంటారు.










