హిండెన్‌బర్గ్ తరహా రిపోర్ట్
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ తరహాలోనే మరో అంతర్జాతీయ సంస్థ భారత కార్పొరేట్ల ఆర్థిక అవకతవకలపై త్వరలో నివేదికను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదాని మోసాలపై ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్‌బర్గ్ కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మరో భారత కార్పొరేట్ దిగ్గజం అవకతవకలపై ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్, రాక్‌ఫెల్లర్స్ బ్రదర్స్ వంటి దిగ్గజాలతో నడుస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్‌పి) ఓ నివేదికను వెల్లడించనుందని ఆంగ్ల పత్రికలు కథనం ప్రచురించాయి. ఈ సంస్థ వ్యవస్థీకృత నేరాలపై నివేదికలు ఇస్తుంది. అయితే అది ఏ కార్పొరేట్ దిగ్గజంపైనా ఉండొచ్చనే విషయం తెలియాల్సి ఉంది. భారత కార్పొరేట్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపైనే ఈ నివేదిక దృష్టి సారించనుందని సమాచారం.










