Apr 25,2023 21:47

హైదరాబాద్‌ : మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) పికప్‌ బ్రాండ్‌ బొలెరోలో కొత్తగా మాక్స్‌ శ్రేణీని ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్‌లో వీటిని ఆ కంపెనీ సౌత్‌ జోనల్‌ హెడ్‌ అరునంగ్షు లాంచనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. మాక్స్‌ శ్రేణీ నూతన మైలురాళ్లను సృష్టించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త శ్రేణీ అధిక పేలోడ్‌ సామర్థ్యం, మెరుగైన మైలేజ్‌ , పనితీరు, ఉత్తమ సౌకర్యం, భద్రత, అత్యంత విశ్వసనీయ, సమర్థవంతమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. కనీసం రూ.24,999 డౌన్‌ పేమెంట్‌తో దీన్ని బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ పథకాలను కూడా అందిస్తోన్నామన్నారు. వీటి ధరల శ్రేణీని రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షలుగా నిర్ణయించింది.