Apr 17,2023 07:09

బొబ్బర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉండటంతోపాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. షుగరు, అధికబరువు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి పరిష్కారం చూపుతాయి.

  •  బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్‌ అధిక బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
  •  మధుమేహులకు లో-గ్లిజమిక్‌ ఇండెక్స్‌ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
  •  బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు. ఇవి శరీరంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
  •  బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి. వీటిలో ఉన్న ఫ్లెవనాయిడ్స్‌, మినిరల్స్‌, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.
  •  వీటిలో ఉన్న ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అధిక ప్రొటీన్‌ కంటెంట్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.