నెత్తుటి మరకల చరిత్రను లిఖించడం
వాళ్ళకు కొత్తేం కాదు
నరమేధం సృష్టించడం
వాళ్ళ మేధలో ఎప్పుడూ నిక్షిప్తమై ఉన్నదే కదా!
మానవత్వం కంటే మతమే గొప్పదని
మతోన్మాదకణాల్ని నరనరాన ఎక్కించుకున్న
నిఖార్సైన పాలకులు కదా!
మంటల్ని రగిలించడం
కుత్తుకల్ని తెగ్గోయడం
అమావీయ రాక్షసత్వపు పునాదులపై
మనువాదాన్ని బతికించడం వల్లే కదా ...
వాళ్ళిప్పుడు దేశభక్తులు !
గోద్రా సజీవ దహనాలైనా
మణిపూర్ అత్యాచారాలైనా
హింసోన్మాదం నాగ్‌పూర్ చలి మర గదుల్లోంచి
పుట్టుకొచ్చినదే కదా
దేశం వాళ్ళకిప్పుడు యుద్ధ మైదానం
మనుషులకు, మతోన్మాదులకు మధ్య నడుస్తున్న
అరాచక సంగ్రామం!
వాళ్ళిప్పుడు వాళ్ళు కాని,
వాళ్ళ సమూహంలో లేని,
మనుషుల నెత్తురు మరిగిన పులులు..!
- కెంగార మోహన్
94933 75447










