ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం త్యేగాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ జన్మదిన వేడుకలలో భాగంగా నీటిపల్లి దివాకర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, మండల ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి, నమ్మి మీణా ప్రారంభం చేశారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ విశాఖపట్నం వైద్యులు కలిసి యువకుల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ... రక్తదానం వేరొకరికి ప్రాణదానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిని పాలెం సర్పంచ్ కలగా గున్నయ నాయుడు, కశింకోట సర్పంచ్ జయరజనీ, నీటిపల్లి లక్ష్మి శ్యామ్‌సన్ పాల్గొన్నారు.










