Jun 14,2023 12:49

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మండపేట మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన యడ్ల సత్యను రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీ లత బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ... 28 సార్లు రక్త దానం చేయడం అభినందనీయమన్నారు. దాత సత్యను స్ఫూర్తిగా తీసుకొని ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. అవసరమైన వారికి రక్తదానం చేయడంలో తాను ముందు ఉంటానని దాత సత్య అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఏడిద గ్రామానికి చెందిన సీలి కిషోర్‌, అందుకూరి రవికుమార్‌, చంద్రమళ్ల కమల్‌ లు రక్తదానం చేశారు.