హైదరాబాద్ : ఆగస్ట్ 25 నుండి 27 వరకు అగ్రిటెక్ ఇండియా 2023 అతిపెద్ద అగ్రి ఎక్స్ పోను ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. బెంగళూరులోని బిఐఇసిలో మూడు రోజులపాటు 14వ ఎడిషన్ అగ్రిటెక్ ఇండియా 2023 అతిపెద్ద అగ్రి ఎక్స్ పో జరుగనుందని నిర్వాహకులు నఖ్వీ తెలిపారు. ఇందులో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, వ్యవసాయ డ్రోన్లు, విత్తనాలు, వ్యవసాయ రసాయనం, గ్రీన్‌హౌస్, హైడ్రోపోనిక్స్, పరికరాల సరఫరాదారులు ఒకే వేదికపైకి రానున్నారని తెలిపారు. 20కి పైగా దేశాల నుండి వందలాది మంది ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారని పేర్కొన్నారు.










