ఇంటర్నెట్‌డెస్క్ : కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ ట్యూటరింగ్ స్టార్టప్ కంపెనీ బైజ్యూస్‌కి మంచి ఆదరణ లభించింది. కరోనా సమయంలో ఆర్థికంగా బలం పుంజుకున్న ఈ కంపెనీ.. కోవిడ్ అనంతరం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆఖరుకు ఈ కంపెనీ తీసుకున్న రుణాలను కూడా చెల్లించలేని పరిస్థితుల్లోకి పడిపోయింది. ఈ కంపెనీ తీసుకున్న రుణానికి త్రైమాసికానికి 40 మిలియన్ల వడ్డీ చెల్లించాలి. కానీ వీటిని కూడా చెల్లించలేని పరిస్థితుల్లో బైజూస్ కంపెనీ ఉందని సమాచారం. జూన్ 5 వడ్డీ చెల్లింపులకు చివరి తేది. వడ్డీ చెల్లింపులు జరగకపోవడం వల్ల తీసుకోబోయే 1.2 బిలియన్ల డాలర్ల రుణం డిఫాల్ట్ అవ్వనుందని ఎడ్‌టెక్ సంస్థ అంచనా వేసింది. అలాగే వడ్డీ చెల్లింపుల సంబంధించిన వాటిపై బైజూస్ ఏవిధంగానూ స్పందించలేదని, దీంతో హౌలిహాన్ లోకీ ఇంక్ ప్రతినిధులు ఆ కంపెనీ తీసుకోబోయే రుణానికి సంబంధించిన వ్యవహారాలపై సుముఖత చూపకపోవడంతో 1.2 బిలియన్ల డాలర్ల అతిపెద్ద రుణం ఇవ్వడానికి సిద్ధపడలేదని సమాచారం. 1.2 బిలియన్ రుణం అంటే.. ఇప్పటివరకు ఏ స్టార్టప్ కంపెనీ కూడా తీసుకోలేదు. ఆర్థిక కష్టాల వల్ల బైజూస్ అతిపెద్ద రుణం తీసుకోవడానికి సిద్ధపడింది.
కాగా, మాజీ ఉపాధ్యాయులు బైజు రవీంద్రన్ నేతృత్వంలో ఈ కంపెనీ మహమ్మారి సమయంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రుణాన్ని చెల్లించమని డిమాండ్ చేస్తున్నారని బ్లూమ్‌బర్గ్ గత వారం వెల్లడించింది.