Oct 15,2023 15:51

ప్రజాశక్తి - ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) : రాజమండ్రిలో లోకేష్‌ క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి సంఘీభావం తెలిపారు. బాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో జరుగుతున్న ''బాబుతో నేను ప్రోగ్రాం'' ద్వారా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.