Sep 06,2023 18:11

ప్రజాశక్తి రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం మంగపేట ఆర్‌ఆర్‌-5 నూతన లే అవుట్లలో కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కురుమట్ల మాట్లాడుతూ.. మంగంపేటలో ఏపీఎండిసి సంస్థకు భూములు ఇచ్చిన నిర్వాసితుల కోసం ఏర్పాటుచేసిన లేఔట్‌ నందు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మంగంపేట వెరైటీస్‌ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఏపీఎండిసి సంస్థ నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజ రెడ్డి, ఏపీఎండీసీ సిపిఓ సుదర్శన్‌ రెడ్డి, సర్పంచ్‌ సుధాకర్‌, కాంట్రాక్టర్‌ సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.