May 05,2023 15:14

విజయవాడ: నగరంలోని గురునానక్‌ కాలనీలోని బాలుడు గల్లంతయ్యాడు. అభి అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి మురుగు కాల్వలో పడిపోయాడు. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీల్లో వరదనీరు ఉద్ధఅతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గురునానక్‌ కాలనీ వద్ద ఓ డ్రైనేజీకి పైకప్పు లేకపోవడంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడి గల్లంతయ్యాడు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నేతలు, అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.