Oct 17,2023 14:50

ప్రజాశక్తి-ఆలమూరు(కోనసీమ) : మండలంలోని కలవచర్లలో బీసీల ఏరియాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన రామాలయానికి ప్రభుత్వ విప్‌, కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్ట్‌ నుండి 10 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అలాగే దీనికి సంబంధించిన ధృవ పత్రాలను బీసీ సంఘ సభ్యులకు ఆయన అందచేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వనుం జార్జి బాబు, కుడుపూడి లోవ సత్యనారాయణ, రావాడ సత్తిబాబు, గుత్తుల శ్రీనివాస్‌, జుత్తుగ శ్రీనివాస్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.