Mar 20,2023 07:28

కోల్‌కతాలోని భారతీయ భాషా పరిషద్‌ తెలుగులో ప్రముఖ కవి డా. ఎన్‌.గోపికి ప్రతిష్టాత్మకమైన కృతిత్వ సమగ్ర సమ్మాన్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు ప్రదానోత్సవం (అలంకరణ్‌ సమారోహ్ ) ఏప్రిల్‌ 8, 2023 సాయంత్రం 4 గంటలకు కోల్‌కతాలోని పరిషద్‌ సభాగారంలో జరుగుతుంది. పురస్కారం కింద లక్ష రూపాయల నగదు, అంగవస్త్రం, సైటేషన్‌లను బహూకరిస్తారు. 2020 మార్చిలో జరగాల్సిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా మూడేళ్లు ఆలస్యంగా జరుగుతుంది. ఈ మేరకు పరిషద్‌ అధ్యక్షురాలు డా. కుసుమ్‌ ఖేమాని ఒక ప్రకటనలో తెలిపారు.