చెన్నయ్ : తన ప్రీ-ఓన్డ్ వాణిజ్య వాహనాల వినియోగదారులకు డిజిటలైజ్ట్ పరిష్కారాలను అందించేందుఎ ఐక్విప్పోతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్‌కు చెందిన భారత్ బెంజ్ తెలిపింది. ఈ భాగస్వామ్యం భారత్ బెంజ్ వినియోగదారులకు వారు ఉపయోగించిన వాహనాలను తక్కువ సమయంలో మార్పిడి చేసుకునేందుకు, మెరుగైన పున విక్రయ విలువను పొందేందుకు మద్దతును అందిస్తుందని పేర్కొంది.