Nov 07,2022 11:42

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : ఫ్యామిలీ ఫిజీషియన్‌ తో మెరుగైన వైద్యం ఉపయోగం అని వైద్య అధికారి చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని తాళ్ళపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్‌ శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి అని అన్నారు. సమాయానికి ఆహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లగిశెట్టి భవానీ, వైసిపి నాయకులు లగిశెట్టి గణేష్‌, గ్రామ కార్యదర్శి వెంకట లక్ష్మీ, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.