Feb 20,2023 20:32

హైదరాబాద్‌ : పెట్టుబడుల విషయంలో వైవిధ్యం పాటించడం ద్వారానే మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలుంటుందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. ఇందుకోసం క్వాంటమ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌, రెడీమేడ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ సరైన ఎంపిక అని తెలిపింది. ''మార్కెట్లు అనిశ్చితితో నిండిపోవడంతో ఇన్వెస్టర్లు అస్థిరతను ఎదుర్కొంటున్నారు. పెట్టుబడిదారుల రాబడిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఇలాంటి క్లిష్ట కాలంలో మెరుగైన రాబడులు అందుకోవడానికి పెట్టుబడుల విషయంలో వైవిధ్యం పాటించాల్సి ఉంటుంది. ఈ దిశగా ఫిక్సిడ్‌ డిపాజిట్లకు మించి రాబడులు పొందడానికి క్వాంటమ్‌ వంటి రెడీమేడ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ తోడ్పడగలదు.'' అని ఆ సంస్థ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ చిరాగ్‌ మెహతా పేర్కొన్నారు.