కోల్‌కత్తా: టీమిండియా సీనియర్ ఆటగాడు, పశ్చిమ్ బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. తివారీ టీమిండియా తరఫున 12వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. జాతీయ జట్టుకు 2008లో ఎంపికైన మనోజ్ తివారీ 2015 వరకు ఆడాడు. 37ఏళ్ల తివారీ చివరిసారిగా 2015లో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత దేశవాళీలోనే ఆడుతూ వచ్చాడు. ఇటీవల రంజీ ట్రోఫీలోనూ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు రాజకీయాల్లోకి చేరారు. 2021లో తృణమూల్ పార్టీ తరఫున సిబ్‌పుర్ నియోజవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.










