హైదరాబాద్ : ఫర్నిచర్, గృహాలంకరణ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు సిద్ధాంత్, శివాని ఆనంద్‌లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ''బే విండో''ను ప్రారంభించామని తెలిపారు. హైదరాబాద్‌లో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నూతన స్టోర్‌ను గురువారం వారు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సిద్దాంత్ మాట్లాడుతూ.. ఖాజానా గ్రూప్ నుండి వచ్చిన తాము నాణ్యతపై రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. వచ్చే మూడేళ్లలో 10 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.










