Jul 20,2023 11:05
  • అర్‌కే బీచ్‌లో వాక్‌ ధాన్‌

ప్రజాశక్తి-ఏంవిపి కాలనీ(విశాఖ) : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 116 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం ఆర్కే బీచ్‌ లోని కాళీమాత టెంపుల్‌ వద్ద నుండి వైఎంసిఏ బీచ్‌ వరకు వాకధన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సన్యాసిరావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గత ఏడాది విశాఖపట్నం పరిశుభ్ర నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిందని, స్వచ్ఛ సర్వేక్షన్‌లో నాలుగో స్థానంలో నిలిచిందని ఈ ఏడాది కూడా మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని దానికి తోడ్పాటు అందించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలు ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు బీచ్‌ క్లీనింగ్‌ మరియు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖ సుందర నగరంగా తీర్చి దిద్దేందుకు సహకరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా నగరవాసులంతా సింగల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ను వదిలి జూట్‌ మరియు గుడ్డ బ్యాగులను ఉపయోగించాలని ఆయన కోరారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 116 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, విశాఖపట్నం రీజినల్‌ మేనేజర్‌ పీ.ఎం ప్రధాన్‌ మాట్లాడుతూ తమ బ్యాంకు దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించిందని ఎల్లవేళలా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ 115 సంవత్సరాలు పూర్తి చేసుకుని 116 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని దానికి సహకరించిన వినియోగదారులకు మద్దతుదారులకు తమ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తామని అన్నారు. అదేవిధంగా సుందర విశాఖ నగరంలో ఈకో వైజాగ్‌ పేరుతో నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌లో భాగస్వాములు కావటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు , ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2